Header Banner

జీటీ ఎక్స్ ప్రెస్ జోరుకు బిగ్ బ్రేక్! ఆర్సీబీకి భలే ఛాన్స్..!

  Fri May 23, 2025 09:19        Sports

ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 33 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టిన తరువాత ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడం, ఇందులో మట్టికరవడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్టయింది.


శుక్రవారం నాటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిస్తే- పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకుతుంది. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఎదుర్కొనబోతోంది ఆర్సీబీ. సాయంత్రం 7: 30 గంటలకు లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా స్టేడియం.. దీనికి వేదిక.


టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. కసితీరా ఆడింది ఇందులో. ప్రత్యేకించి ఓపెనర్ మిఛెల్ మార్ష్, టాప్ ఆర్డర్ బ్యాటర్ నికొలస్ పూరన్ అదరగొట్టారు. స్టేడియంలో పరుగుల వరద పారించారు. ఈ క్రమంలో మిఛెల్ మార్ష్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 64 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, 10 ఫోర్లతో 117 పరుగులు బాదాడు. 27 బంతులను ఎదుర్కొన్న నికొలస్ పూరన్.. 56 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో అయిదు భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఎయిడెన్ మార్క్ రమ్- 24 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 36, కేప్టెన్ రిషభ్ పంత్ ఆరు బంతుల్లో రెండు సిక్సర్లతో 16 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో సూపర్ జెయింట్స్ జట్టు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 235 పరుగుల వద్ద ఆగింది.


ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

అనంతరం ఛేజింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగలిగింది. చివరి మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన ఓపెనర్ సాయి సుదర్శన్ ఇక్కడ విఫలం అయ్యాడు. 21 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్ లో ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు. కేప్టెన్ శుభ్ మన్ గిల్ దీ అదే పరిస్థితి. 20 బంతుల్లో 35 పరుగులకు వెనుదిరిగాడు.


జోస్ బట్లర్- 33, షెర్ఫానె రూథర్ ఫర్డ్- 38, రాహుల్ తెవాతియా- 2, కగిసొ రబడ- 2, సాయి కిశోర్ 1 పరుగు చేవారు. మిడిలార్డర్ లో ఎం షారుఖ్ ఖాన్ అర్ధసెంచరీతో ఆదుకోకపోయివుంటే గుజరాత్ స్కోర్ 200 పరుగులు దాటి ఉండేది కాదు. షారుఖ్ ఖాన్.. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. 29 బంతుల్లో మూడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 57 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లల్లో విల్ ఒరూర్కీ మూడు వికెట్లతో సత్తా చాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. సాయి సుదర్శన్, షెర్ఫానె రూథర్ ఫర్డ్, రాహుల్ తెవాతియా వికెట్లు కూల్చాడు. అవేష్ ఖాన్, ఆయుష్ బదొని రెండు చొప్పున, ఆకాష్ సింగ్, షాబాజ్ అహ్మద్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.


ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!

 

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!

 

దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!

 

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!



ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GTExpress #RCBvsGT #IPL2025 #GTvsRCB #BigBreakHalted #CricketThriller #IPLHighlights